అడ్డు వచ్చిన అత్తపై అల్లుడు కత్తితో దాడి.. | Son in law attacks on mother in law | Sakshi
Sakshi News home page

అడ్డు వచ్చిన అత్తపై అల్లుడు కత్తితో దాడి..

May 15 2016 5:23 PM | Updated on Jul 10 2019 7:55 PM

కుటుంబ కలహాలతో దంపతుల మధ్య ఘర్షణకు దారితీసింది.

నిజామాబాద్‌: కుటుంబ కలహాలతో దంపతుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో అడ్డు వచ్చిన అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండలం సిద్ధాపూర్‌ తండాలో ఆదివారం చోటుచేసుకుంది. కూతుర్ని ఎందుకు కొట్టావని అడగటానికి వచ్చిన అత్తపై అల్లుడు కత్తితో దాడికి దిగాడు.

ఆమెను గట్టిగా పొడవటంతో పేగులు బయటకు వచ్చాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అల్లుడు నానక్ సింగ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement