సోమశిలకు 3,472 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | somasila dam | Sakshi
Sakshi News home page

సోమశిలకు 3,472 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Aug 2 2016 12:27 AM | Updated on Sep 4 2017 7:22 AM

సోమశిలకు 3,472 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

సోమశిలకు 3,472 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

సోమశిల : రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల జలాశయానికి సోమవారం ఉదయం కల్లా 3,472 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

 
 
సోమశిల : రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల జలాశయానికి సోమవారం ఉదయం కల్లా 3,472 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సోమశిలకు పైతట్టు ప్రాంతాలైన పెన్నా నది ప్రధాన హెడ్‌ రెగ్యులేటర్‌ ఉన్నæ వైఎస్సార్‌ జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద 700 క్యూసెక్కుల వంతున వరద ప్రహిస్తోంది. చెన్నూరు వద్ద 1,100 క్యూసెక్కుల వరద నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 11.069 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నారు డెల్టాకు 2వేల క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 84.32 మీటర్లు, 276.64 అడుగుల మట్టం నమోదైంది. సగటున 55 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement