విజయవాడ తరలిన శోభన్‌బాబు విగ్రహం | sobhan babu statue at vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ తరలిన శోభన్‌బాబు విగ్రహం

Aug 26 2015 6:41 PM | Updated on Aug 28 2018 4:30 PM

విజయవాడ తరలిన శోభన్‌బాబు విగ్రహం - Sakshi

విజయవాడ తరలిన శోభన్‌బాబు విగ్రహం

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని వుడయూర్ శిల్పశాలలో రూపొందిన ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు విగ్రహాన్ని బుధవారం విజయవాడకు తరలించారు.

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని వుడయూర్ శిల్పశాలలో రూపొందిన ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు విగ్రహాన్ని బుధవారం విజయవాడకు తరలించారు. 8 అడుగుల ఆ కాంస్య విగ్రహాన్ని విజయవాడ గాంధీనగర్ సెంటర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు శిల్పి రాజ్‌కుమార్ వుడయూర్ తెలిపారు. శోభన్‌బాబు స్వగ్రామం కృష్ణా జిల్లా మైలవరం మండలం చిననందిగామ అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బంధువులు, ఆయన అభిమానుల కోరిక మేరకు శోభనబాబు కుమారుడు కరుణశేషు ఆధ్వర్యంలో విగ్రహాన్ని విజయవాడలో నెలకొల్పుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాజమండ్రి, చెన్నై, విశాఖపట్నం, కర్నూలు నగరాల్లో ఏర్పాటు చేసిన శోభన్‌బాబు విగ్రహాలన్నీ తాము తయూరు చేసినవేనని ఆయన వెల్లడించారు.

అన్ని విగ్రహాలూ ఒకే రీతిలో తయారు చేయడానికి గల కారణాలను ఈ సందర్బంగా ఆయన వివరించారు. రెండు చేతులతో కోటును పట్టుకున్నట్టు ఉండే విగ్రహాలు బాగున్నాయని ప్రశంసలు రావడంతో విజయవాడలో కూడా అదే తరహాలో విగ్రహాన్ని రూపొందించామని రాజ్‌కుమార్ వుడయూర్ చెప్పారు. ఈ విగ్రహాన్ని ఈ వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించ వచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement