కోవూరు : త్వరలో జరగబోయే పాఠశాల అభివద్ధి కమిటీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎంఈఓ జగన్నాథశర్మ ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం మండల పరిధిలోని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎస్‌ఎంసీ ఎన్నికలపై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు.
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి
Jul 19 2016 6:36 PM | Updated on Sep 15 2018 4:12 PM
కోవూరు : త్వరలో జరగబోయే పాఠశాల అభివద్ధి కమిటీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎంఈఓ జగన్నాథశర్మ ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం మండల పరిధిలోని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎస్‌ఎంసీ ఎన్నికలపై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఈనెల 20 నుంచి 26వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఒక్కొక్క తరగతికి ముగ్గురు సభ్యుల చొప్పున ఎంపిక చేసి ఎంపికైన సభ్యులందరి చేత చైర్మన్, వైస్‌చైర్మన్లను ఎన్నుకోవాలన్నారు. ఓటర్ల జాబితాను ముందుగానే పాఠశాల వద్ద ప్రచురింపజేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికలు జరిగే రోజు పాఠశాలల్లోనే నామినేçషన్ దాఖలు చేసుకోవచ్చనన్నారు. ఎన్నికలు 7 నుంచి 1 గంట లోపు నిర్వహించాలని, మూడు గంటలకు చైర్మన్ ఎన్నిక జరపాలన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా హెచ్‌ఎంలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
Advertisement
Advertisement