14న ఎస్కేయూ పాలకమండలి సమావేశం | sku administration meeting on 14th | Sakshi
Sakshi News home page

14న ఎస్కేయూ పాలకమండలి సమావేశం

Feb 10 2017 9:47 PM | Updated on Nov 6 2018 5:13 PM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా 14వ తేదీ సమావేశం నిర్వహించనున్నారు.

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా 14వ తేదీ సమావేశం నిర్వహించనున్నారు. ఎస్కేయూ వార్షిక బడ్జెట్‌ 2017 - 18పై ప్రధానంగా చర్చించనున్నారు. అయితే అదేరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పాలకమండలిలో ఎక్స్‌ అఫిషియో సభ్యులైన ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఫైనాన్స్‌ సెక్రటరీ, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్లు పాలకమండలి సమావేశానికి హాజరవుతారా, లేదా అనే సమాచారం వర్శిటీకి అందలేదు. దీంతో సమావేశంపై సందిగ్ధత నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement