పవిత్ర యాత్ర.. | Since the city started the first Hajj tour | Sakshi
Sakshi News home page

పవిత్ర యాత్ర..

Aug 21 2016 10:35 PM | Updated on Sep 4 2018 5:21 PM

పవిత్ర యాత్ర.. - Sakshi

పవిత్ర యాత్ర..

ఉప ముఖ్యమంత్రి అలీ రాష్ట్ర హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో హజ్‌ యాత్ర–2016ను ప్రారంభించారు.

సాక్షి, సిటీ బ్యూరో: నగరం నుంచి తొలి హజ్‌ యాత్ర ప్రారంభమైంది. ఆదివారం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ రాష్ట్ర హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో హజ్‌ యాత్ర–2016ను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత హజ్‌ హౌస్‌లోని క్యాంప్‌ నుంచి యాత్రికుల బస్సుకు జెండా ఊపి రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పంపించారు. పవిత్ర హృదయంతో రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్ధించాలని డిప్యూటీ సీఎం యాత్రికులకు విజ్ఞప్తి చేశారు. కాగా, తమవారు హజ్‌కు వెళుతుంటే బంధువులు ఉద్వేగానికి గురయ్యారు.

 

Advertisement
 
Advertisement
Advertisement