ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అండగా ఉంటాం | siddhartha old students meet | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అండగా ఉంటాం

Dec 24 2016 10:00 PM | Updated on Sep 4 2017 11:31 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అండగా ఉంటాం

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అండగా ఉంటాం

ఇంజినీరింగ్‌ చదువుతున్న ప్రతిభ కలిగిన విద్యార్థులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని వీఆర్‌ సిద్దార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ పూర్వ విద్యార్థులు ప్రకటించారు.

కానూరు(పెనమలూరు) : ఇంజినీరింగ్‌ చదువుతున్న ప్రతిభ కలిగిన విద్యార్థులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని వీఆర్‌ సిద్దార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ పూర్వ విద్యార్థులు ప్రకటించారు. కానూరులోని కాలేజీ ప్రాంగణంలో 1987-1991 మధ్యలో చదివిన విద్యార్థులు 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం సమావేశం నిర్వహించారు. యుఎస్‌ అపోలో హాస్పటల్‌ సీఈవో గోపాలం గోపీనా«థ్‌ మాట్లాడుతూ విద్యార్థులు నూతన ప్రయోగాలు చేస్తే వారికి 5 వేల డాలర్లు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సంఘ అధ్యక్షుడు సి.రవికుమార్‌ మాట్లాడుతూ తాము కార్పస్‌ ఫండ్‌ కింద రూ 4 కోట్లు సమకూర్చామన్నారు. ప్రతి ఏడాదీ ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ 30 లక్షలు ప్రోత్సాహకం అందజేస్తామని వివరించారు. ఈ సమావేశానికి దేశ, విదేశాల నుంచి 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుని సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో కాలేజీ కన్వీనర్‌ ఎం.రాజయ్య, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.వి.రత్నప్రసాద్, డీన్‌ పాండురంగారావు, సంఘ కార్యదర్శి జానకీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement