నాచగిరి.. శ్రావణ సందడి | Sakshi
Sakshi News home page

నాచగిరి.. శ్రావణ సందడి

Published Sun, Aug 28 2016 9:53 PM

నాచగిరి.. శ్రావణ సందడి

  • ఓ వైపు సత్యనారాయణవ్రతాలు
  • మరోవైపు ఉట్లోత్సవ వేడుకలు
  • కిటకిటలాడిన పుణ్యక్షేత్రం

  • నాచారంగుట్ట(వర్గల్‌):శ్రావణమాసం చివరి ఆదివారం వారాంతపు సెలవురోజు నాచగిరి శ్రీలక్ష్మీనృసింహక్షేత్రం భక్తులతో పోటెత్తింది. శ్రావణమాసంలో పుణ్యక్షేత్రం సందర్శించి పూజల్లో పాల్గొంటే విశేష పుణ్యం లభిస్తుందని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. ఉదయం నుంచే క్షేత్రానికి భక్తుల తాకిడి మొదలైంది.

    ఓవైపు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు, మరోవైపు సత్యనారాయణస్వామి వ్రతమండపంలో దంపతుల సామూహిక వ్రతాలు, గర్భగుడిలో నారసింహుని దర్శనార్థం బారులు తీరిన భక్తులతో నాచగిరిలో ఎటు చూసినా భక్తుల రద్దీ కన్పించింది. సాయంత్రం వరకు 80 సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరిసాయి.
    ఉట్లోత్సవ సంబరం
    నాచగిరిలో గోకులాష్టమి వేడుకలు ఆదివారం సాయంత్రం ఉట్లోత్సవంతో ముగిసాయి. లక్ష్మీసమేతులైన స్వామి వారు ఉట్లోత్సవం తిలకించేందుకు పల్లకిపై ఆలయ ఉత్తర ద్వారం వైపు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ ఉట్లు కొట్టె కార్యక్రమం తిలకించారు. చప్పట్లు, కేరింతల మధ్య కొనసాగిన ఈ వేడుకలో భక్తులు పాల్గొని ఆనందపరవశులయ్యారు. స్వామి వారిని దర్శించుకుని తరించారు.
    తులు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement