నాలుగు రోజుల క్రితం వెళ్లి..
నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన గేదెల కాపరి మృతి చెంది ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
శవమై కనిపించిన వైనం
బొల్లాపల్లి : నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన గేదెల కాపరి మృతి చెంది ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన చెంచు యువకుడు శీలం వెంకటేశ్వర్లు (30) ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో తూర్పు పొలాల వైపు చెక్క వాగులో ఓ మృతదేహం పడి ఉన్న విషయాన్ని స్థానికులు గమనించి సమాచారం అందించారు. దీంతో వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని వెంకటేశ్వర్లుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇంటి నుంచి వెళ్లి నాలుగు రోజులుగా తిరిగి రాలేదని వారు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఏఎస్సై సాంబశివరావు తెలిపారు. మృతదేహానికి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య మంగమ్మ, కుమారుడు మాధవరావు ఉన్నారు. హనుమాపురంలో గేదెల కాపరిగా జీవనం సాగిస్తుంటాడు. అయితే, అతని మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.