తీర ప్రాంత రక్షణపై ప్రత్యేక దృష్టి | Security guards passing out parade | Sakshi
Sakshi News home page

తీర ప్రాంత రక్షణపై ప్రత్యేక దృష్టి

Nov 17 2016 1:14 AM | Updated on Oct 20 2018 6:19 PM

తీర ప్రాంత రక్షణపై ప్రత్యేక దృష్టి - Sakshi

తీర ప్రాంత రక్షణపై ప్రత్యేక దృష్టి

ముత్తుకూరు : సముద్రతీర ప్రాంత రక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కృష్ణపట్నం ఇండియన్‌ కోస్ట్‌గార్డు కమాండింగ్‌ ఆఫీసర్‌ వేణుమాధవ్‌ అన్నారు.

  • కోస్ట్‌గార్డు కమాండెంట్‌ వేణుమాధవ్‌
  •  ఘనంగా పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌  
  • ముత్తుకూరు : సముద్రతీర ప్రాంత రక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కృష్ణపట్నం ఇండియన్‌ కోస్ట్‌గార్డు కమాండింగ్‌ ఆఫీసర్‌ వేణుమాధవ్‌ అన్నారు.  పోర్టు రక్షణకు, తీరప్రాంత రక్షణకు  కేఎస్‌ఎస్‌పీఎల్‌ సెక్యూరిటీ ఎంతో సహకరిస్తుందని ప్రశంసించారు. గోపాలపురంలోని కేఎస్‌ఎస్‌పీఎల్‌ సెక్యూరిటీ కేంద్రంలో శిక్షణ పూర్తిచేసుకున్న 26వ బ్యాచ్‌ సెక్యూరిటీ గార్డుల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. వేణుమాధవ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గౌరవవందనం స్వీకరించి, ప్రసంగించారు. నిపుణులు ఇచ్చిన శిక్షణ, గార్డుల మార్చ్‌ఫాస్ట్‌ స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. పోర్టు సీనియర్‌ జీఎం, ప్రిన్సిపల్‌ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు 26 బ్యాచ్‌ల ద్వారా 3,100 మంది సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇచ్చామన్నారు. స్కిల్లింగ్‌ అకాడమీ, ప్రొఫెషనల్‌ కోర్సులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం శిక్షణలో ప్రతిభ చూపిన గార్డులకు జ్ఞాపికలు అందించారు.   ఏజీఎం మనోహరబాబు, పోర్టు ప్రతినిధులు పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement