విద్యాశాఖాధికారుల తనిఖీలు | school officers inspection in prakasam district over sakshi effect | Sakshi
Sakshi News home page

విద్యాశాఖాధికారుల తనిఖీలు

May 25 2016 11:05 AM | Updated on Sep 15 2018 5:45 PM

కొండపి వేసవి శిక్షణ తరగతులు తూచ్ అన్న శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ మినీలో ప్రచురించిన వార్తకు మండల విద్యాశాఖ అధికారులు స్పందించారు.

కొండపి: కొండపి వేసవి శిక్షణ తరగతులు తూచ్ అన్న శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ మినీలో ప్రచురించిన వార్తకు మండల విద్యాశాఖ అధికారులు స్పందించారు. మంగళవారం స్థానిక ఎస్సీ కాలనీలో ఉన్న వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న స్పెషల్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులు సీఆర్‌పీలతో మాట్లాడారు. క్రమం తప్పకుండా ప్రతి రోజు రెండు గంటల పాటు విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్, సైన్స్‌లో పాఠాలు బోధించాలన్నారు. బీసీ గ్రేడు విద్యార్థులను ఏ గ్రేడుకు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలన్నారు. మండలంలోని మిగతా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను సైతం తనిఖీ చేస్తామని ఎంఈవో శ్రీనివాసరావు తెలిపారు. వేసవి శిక్షణ తరగతులు నిర్వహించే పాఠశాలలు తెరకుంటే చర్యలు తప్పవన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement