రాష్ట్రస్థాయి పోటీలకు సప్తగిరి విద్యార్థులు | sapthagiri college students to state level competetions | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు సప్తగిరి విద్యార్థులు

Sep 23 2016 12:25 AM | Updated on Sep 4 2017 2:32 PM

పట్టణంలోని సప్తగిరి కళాశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు.

హిందూపురం టౌన్‌ : పట్టణంలోని సప్తగిరి కళాశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు గురువారం రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఎస్కే యూనివర్శిటీ పరిధిలో ఈ నెల 21న నిర్వహించిన పోటీల్లో డిగ్రీ విద్యార్థి ఎస్‌.సాధిక్, ఇంటర్‌ విద్యార్థులు అబూబకర్‌ సిద్దిక్, నాగేష్‌ ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రకాష్‌రెడ్డి, ఏఓ గంగిరెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement