పుష్కరాల్లో పక్కాగా పారిశుద్ధ్యం | sanitation more importance | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో పక్కాగా పారిశుద్ధ్యం

Aug 1 2016 11:54 PM | Updated on Sep 4 2017 7:22 AM

పుష్కరాల్లో పక్కాగా పారిశుద్ధ్యం

పుష్కరాల్లో పక్కాగా పారిశుద్ధ్యం

పుష్కరాల్లో పారిశుధ్యపనుల్ని యాక్షన్‌ప్లాన్‌ ప్రకారం పక్కగా నిర్వహించాలని మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ (సీడీఎంఏ) కన్నబాబు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్పొరేషన్‌ కౌన్సిల్‌హాల్లో సోమవారం సమావేశం నిర్వహించారు.

విజయవాడ సెంట్రల్‌ : పుష్కరాల్లో పారిశుధ్యపనుల్ని యాక్షన్‌ప్లాన్‌ ప్రకారం పక్కగా నిర్వహించాలని మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ (సీడీఎంఏ) కన్నబాబు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్పొరేషన్‌ కౌన్సిల్‌హాల్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ తేదీన ప్రీ పుష్కర పనుల్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు తాము సరఫరా చేయాల్సిన కార్మికుల్ని ఆ తేదీనాటికి విధుల్లో చేర్చాలన్నారు. ప్రతిరోజు మూడు షిప్టులుగా విభజించి పనులు కేటాయిస్తామని,  విధులకు అరగంట ముందే ఘాట్‌లలోని శానిటరీ ఇన్స్‌పెక్టర్లకు కార్మికులు రిపోర్టు చేయాలని ఆదేశించారు. విధుల మధ్యలో కార్మికులు  వెళ్లిపోయినట్లైతే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవన్నారు.  ప్రతి ఐదు రోజులకు ఒకసారి కార్మికులకు జీతాలు విడుదల చేస్తామన్నారు. సక్రమంగా జీతాలు ఇవ్వని కాంట్రాక్టర్లపై జరిమానా విధించడంతో పాటు బిల్లుల చెల్లింపుల్ని నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.
చెత్త కనిపించరాదు 
 చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజారోగ్యశాఖ అధికారులు కృషి చేయాలని కన్నబాబు ఆదేశించారు. మేజర్‌ అవుట్‌ఫాల్‌ డ్రెయిన్ల సిల్టును తొలగించేందుకు నగరపాలక సంస్థ సిబ్బందినిమాత్రమే వినియోగించాల న్నారు. పారిశుద్ధ్య పనిముట్లను కాంట్రాక్టర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. పిండప్రదానాల షెడ్లలో మౌలిక వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు వినియోగించే వాహనాల వివరాలను  రూట్‌ మ్యాపులను పోలీస్‌శాఖకు ముందుగానే అందించి అనుమతులుపొందాలన్నారు. మరుగుదొడ్లు ఉండే ప్రాంతాల్లో నిరంతర నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో చీఫ్‌ ఇంజనీర్‌ ఎంఏ.షుకూర్, జేడీ పూర్ణచంద్రరావు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఎం.గోపీనాయక్, ఈఈలు జీఆర్‌టి. ఓం ప్రకాష్, ధనుంజయ, వివిధ మునిసిపాల్టీల కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, శానిటరీ సూపర్‌వైజర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement