తిరుమలకు సచిన్, నాగార్జున, చిరంజీవి | sachin, nagarjuna, chiranveeji reached tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలకు సచిన్, నాగార్జున, చిరంజీవి

May 31 2016 7:50 PM | Updated on Jul 15 2019 9:21 PM

తిరుమలకు సచిన్, నాగార్జున, చిరంజీవి - Sakshi

తిరుమలకు సచిన్, నాగార్జున, చిరంజీవి

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, భార్య అంజలి టెండుల్కర్ తిరుమల చేరుకున్నారు.

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, భార్య అంజలి టెండుల్కర్ తిరుమల చేరుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత  బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు  ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.

అక్కడ నుంచి సచిన్, తన భార్యతో కలిసి కారులో ముందుగా  తిరుమల బయల్దేరి వెళ్లారు. అనంతరం హీరో నాగార్జున, ఇతరులు మరో వాహనంలో వెళ్లారు. బుధవారం వేకువజామున వీరంతా వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. కాగా నాగార్జున గడ్డం పెంచి కొత్త లుక్లో కనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement