అమరావతికి రైలు కనెక్టివిటీ కల్పిస్తాం: సురేష్ ప్రభు | RVNL to undertake survey on rail connectivity to Amaravathi, says suresh prabhu | Sakshi
Sakshi News home page

అమరావతికి రైలు కనెక్టివిటీ కల్పిస్తాం: సురేష్ ప్రభు

Jun 4 2016 4:22 PM | Updated on Sep 4 2017 1:40 AM

అమరావతికి రైలు కనెక్టివిటీ కల్పిస్తాం: సురేష్ ప్రభు

అమరావతికి రైలు కనెక్టివిటీ కల్పిస్తాం: సురేష్ ప్రభు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీని కల్పిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీని కల్పిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. ఏపీలోని 21 రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. సరకు రవాణాకు ఏపీ హబ్గా ఉంటుందని తెలిపారు. రైల్వే జోన్ అంశాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారని, సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నామన్నారు. అమరావతి లింకేజీ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఏపీ రైల్వే మార్గాల్లో రూ.22 వేల కోట్ల పనులు జరుగుతున్నాయని సురేష్ ప్రభు తెలిపారు.

అంతకు ముందు ఆయన శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. రాజ్యసభకు ఎంపికపై ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఏపీ నుంచి ఎన్నిక కావడం సంతోషంగా ఉందని సురేష్‌ ప్రభు తెలిపారు.  ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement