తిరుమలలో భ క్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుమలలో భ క్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో.. శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం అన్నీ కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) 96,779 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.