ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
విశాఖపట్నం : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన విశాఖ జిల్లా మారికివలసలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.