మెగా వాటర్‌షెడ్‌లో రూ.79లక్షలు స్వాహా | rs.79 lakhs scham in mega watershed scheme | Sakshi
Sakshi News home page

మెగా వాటర్‌షెడ్‌లో రూ.79లక్షలు స్వాహా

Feb 3 2017 11:54 PM | Updated on Sep 5 2017 2:49 AM

రొళ్ల మండలం రత్నగిరి మెగావాటర్‌షెడ్‌లో రూ.79లక్షల నిధులు స్వాహా అయినట్లు డ్వామా అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఏపీడీ) విశ్వనాథ్‌ తెలిపారు.

మడకశిర : రొళ్ల మండలం రత్నగిరి మెగావాటర్‌షెడ్‌లో రూ.79లక్షల నిధులు స్వాహా అయినట్లు డ్వామా అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఏపీడీ) విశ్వనాథ్‌ తెలిపారు. ఈ నిధులను స్వాహా చేసిన ఫోర్డు సంస్థ అధ్యక్షులు బద్రీష్‌తోపాటు సిబ్బంది లక్ష్మణమూర్తి, మహాలింగప్ప, నరసింహామూర్తి, బాలజీలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిందిగా రొళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ముఖ్యంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరింగిందని పేర్కొన్నారు. హార్టికల్చర్‌, ఫారంపాండ్‌ పనుల్లోనూ అవినీతి జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ప్రాథమిక దర్యాపులో రూ.79 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించామన్నారు. దీనిపై లోతుగా విచారణ చేస్తున్నామని ఏపీడీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement