రూ.500 నోటు మారక ఆత్మహత్యాయత్నం | Rs 500 note not change men suicide attempt | Sakshi
Sakshi News home page

రూ.500 నోటు మారక ఆత్మహత్యాయత్నం

Nov 12 2016 10:53 PM | Updated on Sep 4 2017 7:55 PM

రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దుతో పెద్ద నోటు మారక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

కాకినాడ క్రైం : రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దుతో పెద్ద నోటు మారక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలివి...కాకినాడ రూరల్‌ మండలం నేమాం గ్రామానికి చెందిన దిమ్మల సత్తిబాబు (38) కూలి పనులు చేస్తుంటాడు. తనతో పాటు బావను కూడా కూలి పనిలోకి తీసుకెళ్తుంటాడు.

కరెన్సీనోట్ల రద్దుతో, రూ.500 నోటు మారకపోవడంతో బావకు కూలీ సొమ్ము చెల్లించలేదు. డబ్బుల కోసం అక్క ఒత్తిడి చేయడంతో ఆవేదన చెందిన సత్తిబాబు పురుగుల మందును మద్యంలో కలుపుకొని తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement