నవోదయ శిక్షణ కేంద్రానికి రూ.40వేలు సాయం | Rs 40 thousand aid to Navodaya training center | Sakshi
Sakshi News home page

నవోదయ శిక్షణ కేంద్రానికి రూ.40వేలు సాయం

Jan 6 2017 3:46 AM | Updated on Sep 5 2017 12:30 AM

నవోదయ శిక్షణ కేంద్రానికి రూ.40వేలు సాయం

నవోదయ శిక్షణ కేంద్రానికి రూ.40వేలు సాయం

మండల పరిధిలోని మేడిపూర్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత నవోదయ శిక్షణ కేంద్రానికి గురువారం పాలెంకు చెందిన మనసాని రమేష్‌ రూ. 40వేలు, తండ్రిలేని అభయశ్రీకి రూ.2వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

తాడూరు: మండల పరిధిలోని మేడిపూర్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత నవోదయ శిక్షణ కేంద్రానికి గురువారం పాలెంకు చెందిన మనసాని రమేష్‌ రూ. 40వేలు,  తండ్రిలేని అభయశ్రీకి రూ.2వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈసందర్భంగా ఎంఈఓ టి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దాతలు విద్యార్థుల ఎదుగుదల కోసం చదువులో రాణించాలనే ఉద్ధేశ్యంతో చదువుకు పేదరికం అడ్డు రాకూడదనే లక్ష్యంతో సహాయ, సహకారాలు అందించేందుకు ముందుకొచ్చే దాతలు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అనంతరం ఆవోపా తరఫున రూ.5వేల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఆవోపా జిల్లా అధ్యక్షుడు పోల శ్రీధర్, కోశాధికారి రవి, కుమ్మెర జీహెచ్‌ఎం గుడిపల్లి నిరంజన్, ఆయా ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు భద్రన్న, ఎస్వీరాజు, కట్టా శ్రీనివాస్‌రెడ్డి, నవోదయ శిక్షకులు రాములుగౌడ్, కార్తీక్, మధు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement