వైఎస్సార్ జిల్లా కలసపాడులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు జమచేసేందుకు వెళ్లిన ఒక వ్యక్తి నుంచి రూ.4.30 లక్షలు అపహరించిన సంఘటన శనివారం ఉదయం జరిగింది.
కలసపాడు(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా కలసపాడులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు జమచేసేందుకు వెళ్లిన ఒక వ్యక్తి నుంచి రూ.4.30 లక్షలు అపహరించిన సంఘటన శనివారం ఉదయం జరిగింది. కలసపాడు ఎంపీపీ రామకృష్ణారెడ్డి కుమారుడు తిరుపతిరెడ్డి(బాబు) బంగారు నగలపై తీసుకున్న రుణం చెల్లించేందుకు రూ.4.30 లక్షలు తీసుకె ళ్లాడు.
నగదు ఉంచిన బ్యాగు పక్కన పెట్టుకుని పేయీ స్లిప్ రాస్తుండగా పక్కనే ఉన్న ముగ్గురు వ్యక్తులు నగదు సంచిని తీసుకుని ఉడాయించారు. ఈ విషయమై తిరుపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.