‘కుడా’ ఏర్పాటుకు రూ. 10 కోట్లు విడుదల | Rs.10cr relese for kuda | Sakshi
Sakshi News home page

‘కుడా’ ఏర్పాటుకు రూ. 10 కోట్లు విడుదల

Jun 13 2017 10:49 PM | Updated on Sep 5 2017 1:31 PM

కుడా (కర్నూలు ఆర్బన్‌ డెవలప్‌మెంటు ఆథారిటీ) ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 10 కోట్లు విడుదల చేసింది.

- జీఓ 420 జారీ చేసిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వలవన్‌
కర్నూలు (టౌన్‌) :  కుడా (కర్నూలు ఆర్బన్‌ డెవలప్‌మెంటు ఆథారిటీ) ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ జీఓ నెంబర్‌ 420 జారీ చేశారు. కర్నూలు నగరాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో అమోదం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఇందుకు సంబంధించి రూ. 40 కోట్లు కేటాయించింది. మొదటి విడత కింద రూ. 10 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను కుడా కార్యాలయ ఏర్పాటుకు ఖర్చు చేయనున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement