మహదేవ్‌పూర్ మండలంలో పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులు పొంగిపొర్లుతుండడంతో 17 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి.
జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. మహదేవ్‌పూర్ మండలంలో పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులు పొంగిపొర్లుతుండడంతో 17 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధర్మపురి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సింగరేణి రామగుండం రీజియన్‌లో నాలుగు ఓపెన్ కాస్ట్ బొగ్గుపనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.