15లోగా ఫైళ్లన్నీ అప్‌లోడ్‌ చేయాలి | review on new districts | Sakshi
Sakshi News home page

15లోగా ఫైళ్లన్నీ అప్‌లోడ్‌ చేయాలి

Sep 10 2016 10:12 PM | Updated on Oct 17 2018 3:38 PM

15లోగా ఫైళ్లన్నీ అప్‌లోడ్‌ చేయాలి - Sakshi

15లోగా ఫైళ్లన్నీ అప్‌లోడ్‌ చేయాలి

జిల్లా కార్యాలయంలోని ఫైళ్లన్నీ ఈ నెల 15లోగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశమందిరంలో జిల్లాల విభజనపై శనివారం జరిగిన సమీక్షాసమావేశంలో ఆమె మాట్లాడారు. అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించుకోవాలన్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లా కార్యాలయంలోని ఫైళ్లన్నీ ఈ నెల 15లోగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశమందిరంలో జిల్లాల విభజనపై శనివారం జరిగిన సమీక్షాసమావేశంలో ఆమె మాట్లాడారు. అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించుకోవాలన్నారు. సిబ్బంది వివరాలు, వాహనాలు, ఫర్నిచర్‌ వివరాలు అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. జగిత్యాల, పెద్దపల్లిలో ఏర్పాటుచేయనున్న నూతన కార్యాలయాల వివరాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అందులో ఏమైనా సమస్యలుంటే వాట్సప్‌ ద్వారా తెలియజేయాలన్నారు. కొత్త జిల్లాల్లోని సిబ్బంది అక్టోబర్‌ జీతాలను పాతజిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో చెల్లించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి.వీరబ్రహ్మయ్య, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, సీపీవో సుబ్బారావు, హౌసింగ్‌ పీడీ నర్సింహరావు పాల్గొన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement