breaking news
jc devasena
-
15లోగా ఫైళ్లన్నీ అప్లోడ్ చేయాలి
కరీంనగర్ అర్బన్: జిల్లా కార్యాలయంలోని ఫైళ్లన్నీ ఈ నెల 15లోగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లాల విభజనపై శనివారం జరిగిన సమీక్షాసమావేశంలో ఆమె మాట్లాడారు. అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించుకోవాలన్నారు. సిబ్బంది వివరాలు, వాహనాలు, ఫర్నిచర్ వివరాలు అప్లోడ్ చేయాలని చెప్పారు. జగిత్యాల, పెద్దపల్లిలో ఏర్పాటుచేయనున్న నూతన కార్యాలయాల వివరాలను అప్లోడ్ చేయాలని సూచించారు. అందులో ఏమైనా సమస్యలుంటే వాట్సప్ ద్వారా తెలియజేయాలన్నారు. కొత్త జిల్లాల్లోని సిబ్బంది అక్టోబర్ జీతాలను పాతజిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో చెల్లించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి.వీరబ్రహ్మయ్య, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, సీపీవో సుబ్బారావు, హౌసింగ్ పీడీ నర్సింహరావు పాల్గొన్నారు. -
రూ.120కే కిలో కందిపప్పు
నగరంలో విక్రయ కేంద్రాలు ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ దేవసేన ముకరంపుర : పప్పుధరల నియంత్రణకు ప్రభుత్వం నడుం బిగించింది. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పును రూ.165కు పైగా విక్రయిస్తున్న విషయం తెల్సిందే. ఈ ధరలకు కళ్లెం వేసి రూ.120కే కిలో విక్రయించేలా సర్కారు ముందుకొచ్చింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని కిరాణావర్తక సంఘాల ఆధ్వర్యంలో వివిధ దుకాణాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ముందస్తుగా కరీంనగర్‌లోని గంజ్‌ప్రాంతంలో ఐదు, రైతుబజార్, కాశ్మీర్‌గడ్డ రైతుబజార్లో ఒక్కో విక్రయ కేంద్రం చొప్పున మొత్తం ఏడు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా పప్పు విక్రయాలను గురువారం జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గంజ్‌లో పెద్ది సురేష్ ట్రేడర్స్, తిరుమల, శ్రీశైలం, ఓంగాయత్రి, సదానందం కిరాణాల్లో పప్పులు లభించనున్నాయి. కార్యక్రమంలో మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నాయకులు ఎడ్ల అశోక్, కార్పొరేటర్ రూప్సింగ్, డీఎస్వో నాగేశ్వర్రావు, ఏజీపీవో కాశీవిశ్వనాథ్, ఏఎస్వో కిరణ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, కిరాణవర్తక సంఘం అధ్యక్షుడు ఎలగందుల మునీందర్ తదితరులున్నారు.