
ఓరుగల్లు నుంచే టీఆర్ఎస్ కు గుణపాఠం
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నుంచే టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పడం ప్రారంభం కావాలని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నుంచే టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పడం ప్రారంభం కావాలని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా నూతన కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింద న్నారు.