వినతులు స్వీకరించిన కలెక్టర్‌ | Requests received in the collector | Sakshi
Sakshi News home page

వినతులు స్వీకరించిన కలెక్టర్‌

Aug 1 2016 10:11 PM | Updated on Sep 4 2017 7:22 AM

వినతులు స్వీకరించిన కలెక్టర్‌

వినతులు స్వీకరించిన కలెక్టర్‌

సోమవారం కొత్త కలెక్టరేట్‌లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు మీ కోసం కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు.

కడప సెవెన్‌రోడ్స్‌:

సోమవారం కొత్త కలెక్టరేట్‌లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు మీ కోసం కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ఆయన వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అదికారులకు పరిష్కార నిమిత్తం పంపారు. మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారమైతే ప్రజలు ఖర్చులు భరించి మళ్లీ మళ్లీ కలెక్టర్‌కు తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. క్షేత్ర స్థాయిలోనే సమస్యలను పరిష్కరించడంపైదృష్టి కేంద్రీకరించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలు మాత్రమే తన దృష్టికి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఇంటి స్థలాలు, రేషన్‌కార్డులు, పెన్షన్లు, భూ వివాదాలు వంటి సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సులోచన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement