సాంస్కృతిక వికాసానికి నిధులు కేటాయించాలి | realese funds for cultural development | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక వికాసానికి నిధులు కేటాయించాలి

Sep 26 2016 10:35 PM | Updated on Sep 4 2017 3:05 PM

సాంస్కృతిక వికాసానికి నిధులు కేటాయించాలి

సాంస్కృతిక వికాసానికి నిధులు కేటాయించాలి

నూతన రాజధానిలో సాంస్కృతిక వికాసానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ డిమాండ్‌ చేశారు. జాషువా సాంస్కృతిక వేదిక నిర్వహణలో సోమవారం స్థానిక ఎంబీ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

విజయవాడ కల్చరల్‌ : నూతన రాజధానిలో సాంస్కృతిక వికాసానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ డిమాండ్‌ చేశారు. జాషువా సాంస్కృతిక వేదిక నిర్వహణలో సోమవారం స్థానిక ఎంబీ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ వేదిక నిర్వహణలో ఆదివారం మేధావుల సదస్సు నిర్వహించామని వివరాలు తెలియజేశారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లవుతున్నా సాంస్కృతిక వికాసం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించలేదని, కృష్ణా పుష్కరాలకు కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలని, ప్రధాన నగరాల్లో ఆడిటోరియంలు నిర్మించాలని, పేద రచయితల రచనలను ప్రభుత్వమే ప్రచురించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో జాషువా సాంస్కృతిక వేదిక కో–కన్వీనర్‌ జి.సుబ్బారెడ్డి, కమిటీ సభ్యులు జి.నారాయణరావు, కవి పీఎన్‌ఎం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement