
క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
నిడమనూరు : గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మండలంలోని ముకుందాపురంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 62వ జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 బాలబాలికల వాలీబాల్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు.