భూచట్టానికి లోబడి భూమి సేకరణ | rdo statement on land taking for industries in penukonda | Sakshi
Sakshi News home page

భూచట్టానికి లోబడి భూమి సేకరణ

Oct 26 2016 10:51 PM | Updated on Oct 4 2018 5:35 PM

నిర్ధిష్ట భూ చట్టానికి (2013 ) లోబడి పరిశ్రమల స్థాపనకు భూమిని సేకరిస్తామని ఆర్డీఓ రామమూర్తి తెలిపారు.

పెనుకొండ రూరల్‌ : నిర్ధిష్ట భూ చట్టానికి (2013 ) లోబడి పరిశ్రమల స్థాపనకు భూమిని సేకరిస్తామని ఆర్డీఓ రామమూర్తి తెలిపారు.  అమ్మవారుపల్లిలో కియో కార్ల కంపెనీ కోసం భూమిని కోల్పోతున్న ఎర్రమంచి పొలాల రైతులతో బుధవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆర్డీఓ మాట్లాడారు. 592 ఎకరాలు  కంపెనీకి అందజేస్తామన్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిని వంశపారపర్యంగా అనుభవించవచ్చు 

కాని అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరమన్నారు.  రైతు మురళీ మాట్లాడుతూ తమ కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరారు.  20 రోజుల్లో కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో మరో సమావేశం నిర్వహిస్తామన్నారు.  తహసీల్దార్‌ ఇంతియాజ్‌ అహ్మద్, ఆర్‌ఐలు మనోజ్, ప్రభావతి తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement