కాల్మనీ వ్యాపారి రవికాంత్ అరెస్ట్ | ravikanth arrested in call money business | Sakshi
Sakshi News home page

కాల్మనీ వ్యాపారి రవికాంత్ అరెస్ట్

Apr 2 2016 12:22 PM | Updated on Aug 20 2018 4:44 PM

ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో అధికార టీడీపీకి చెందిన కాల్మనీ వ్యాపారి మండవ రవికాంత్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

విజయవాడ : ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో అధికార టీడీపీకి చెందిన కాల్మనీ వ్యాపారి మండవ రవికాంత్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు కృష్ణలంకలోని రవికాంత్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం బాధితులకు మద్దతుగా ధర్నా చేశారు. కాల్మనీ పేరుతో 10 మంది మహిళలను రూ. కోటి వరకు మోసం చేశాడని ఆయా సంఘాలు ఆరోపించాయి. రవికాంత్కు అండగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు వారు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement