9,775 లీటర్ల రేషన్‌ కిరోసిన్‌ పటì ్టవేత | Sakshi
Sakshi News home page

9,775 లీటర్ల రేషన్‌ కిరోసిన్‌ పటì ్టవేత

Published Mon, Sep 5 2016 2:12 AM

ration kerosene siezed

ఏలూరు అర్బన్‌ : రేషన్‌ దుకాణాలకు అందించాల్సిన కిరోసిన్‌ అక్రమంగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తుండగా విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్‌ సీఐ ఎస్‌.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన కె.చక్రధర్‌ అనే వ్యాపారి స్థానిక రైల్వేస్టే షన్‌ సమీపంలో కేవీఆర్‌ సుబ్బారావు డిపో అనే పేరున కిరోసిన్‌ వ్యాపారం చేస్తున్నారు. ఈ డిపో ద్వారా ప్రభుత్వ చౌక డిపోలకు కిరోసిన్‌ సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో డిపో నుంచి బ్లాక్‌ మార్కెట్‌కు భారీ మొత్తంలో కిరోసిన్‌ తరలిపోతుందని సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అధికారులు శనివారం అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా దాడి చేశారు. గుట్టుచప్పుడు కాకుండా ట్యాంకర్‌లో తలిస్తున్న 9,775 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిపో యజమాని చక్రధర్‌తో పాటు ఇద్దరు గుమస్తాలపై కేసు న మోదు చేశామని సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. విజిలెన్స్‌ ఏవో శ్రీనివాస్, ఏసీటీవో, డీడీ రాజేంద్రప్రసాద్‌ దాడుల్లో పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement