రామయ్యకు ప్రత్యేక పూజలు | Ramayyaku special prayers | Sakshi
Sakshi News home page

రామయ్యకు ప్రత్యేక పూజలు

Jul 27 2016 10:44 PM | Updated on Sep 4 2017 6:35 AM

రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

  • భద్రాచలం :
  •     భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. స్వామివారి నిత్య కల్యాణమూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం గావించారు. కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ చేశారు. ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. వేద పండితులు వేద ప్రవచనాలిచ్చారు. అర్చకులు స్వామివారు, అమ్మవార్ల వంశ క్రమాన్ని వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. రామయ్యకు వైభవంగా నిత్యకల్యాణం చేశారు. స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement