తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు: వాతావరణ కేంద్రం | rain in telugu states with in 24 hours, says visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు: వాతావరణ కేంద్రం

Jul 21 2016 6:50 AM | Updated on Sep 4 2017 5:41 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది.

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీంతో తెలంగాణలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని పేర్కొంది. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement