ముంచెత్తిన వర్షం | rain heavy in anantapur district | Sakshi
Sakshi News home page

ముంచెత్తిన వర్షం

Aug 11 2017 9:55 PM | Updated on Jun 1 2018 8:39 PM

ముంచెత్తిన వర్షం - Sakshi

ముంచెత్తిన వర్షం

జిల్లాలో పలు చోట్ల గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది.

జిల్లాలో పలు చోట్ల గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. హిందూపురంలో 52.4 మి.మీ, లేపాక్షిలో 53, చిలమత్తూరులో 7.04, రొళ్లలో 40.2 మడకశిరలో 35.2, అగళిలో 30.4, గుడిబండలో 15, అమరాపురంలో 11 మి.మీ. వర్షపాతం నమోదైంది. హిందూపురంలోని హస్నాబాద్‌, సీపీఐ హమాలీ కాలనీ, సిల్క్‌ కాలనీలతోపాటు లేపాక్షిలోని లోతట్లు ఇళ్లు జలమయమయ్యాయి. మడకశిర మండలం కల్లుమర్రి, మణూరు, బుళ్లసముద్రం తదితర ప్రాంతాల్లో చెరువులు, చెక్‌డ్యాముల్లో నీరు చేరింది. లేపాక్షి మండలం కల్లూరు పశువైద్యశాలలోకి వర్షం నీరు చేరడంతో 15 సంచుల జొన్నలు తడిసిపోయాయి. ఎండుముఖం పట్టిన వేరుశనగ ఈ వర్షంతో కాస్త కోలుకున్నట్టయ్యింది.
- సాక్షి నెట్‌వర్క్‌, అనంతపురం

Advertisement
 
Advertisement
Advertisement