నేడు జిల్లాకు రెయిన్‌గన్లు | rain guns today to anantapur district | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు రెయిన్‌గన్లు

Jul 24 2016 11:44 PM | Updated on Jun 1 2018 8:39 PM

రక్షకతడికి అవసరమైన రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు, డీజిల్‌ ఇంజిన్లు, హెచ్‌డీ పైపులు సోమవారం జిల్లాకు రానున్నాయి.

అనంతపురం అగ్రికల్చర్‌ : రక్షకతడికి అవసరమైన రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు, డీజిల్‌ ఇంజిన్లు, హెచ్‌డీ పైపులు సోమవారం జిల్లాకు రానున్నాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ పంట ఎండిపోతున్నా ‘రక్షకతడి’ ప్రణాళిక అడుగు ముందుకు పడటం లేదని ఈనెల 16న సాక్షిలో ‘నైరుతి’ పేరుతోనూ, అంతకు మునుపు ‘జీవోకే పరిమితమైన రక్షకతడి ప్రణాళిక’ శీర్షికతో కథనాలు ప్రచురితమయ్యాయి.

 

స్పందించిన ఏపీఎంఐపీ, వ్యవసాయశాఖ అధికారులు ఆదిశగా దృష్టి సారించారు. ఈ క్రమంలో రక్షకతడికి అవసరమైన రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు సెట్లు, ఇంజిన్లు, పైపులు సోమవారం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. 63 మండలాల్లోనూ వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో స్టాకు పాయింట్లు గుర్తించారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement