పంటనష్టం పరిహారం అందించాలి | rain Crop damage compensation | Sakshi
Sakshi News home page

పంటనష్టం పరిహారం అందించాలి

Oct 26 2016 12:38 AM | Updated on Mar 28 2019 8:37 PM

పంటనష్టం పరిహారం అందించాలి - Sakshi

పంటనష్టం పరిహారం అందించాలి

ఇటీవల కురిసిన వర్షాలు, మంజీర వరదలతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ బిజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు

 పాపన్నపేట: ఇటీవల కురిసిన వర్షాలు, మంజీర వరదలతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ బిజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సుభాష్‌చంద్రాగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం పాపన్నపేట తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు బీజేపీ నాయకులు మండల కార్యాలయం ఎదుట అరగంటపాటు బైఠాయించారు. ఈసందర్భంగా సుభాష్‌చంద్రాగౌడ్ మాట్లాడుతూ రైతులు ఓ వైపు నకిలీ విత్తనాలతో నష్టపోతుంటే, మరోవైపు ప్రకృతి సహకరించక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల మెదక్ జిల్లాలో సుమారు 5 వేల ఎకరాల పంట నష్టపోయినప్పటికీ ఇప్పటి వరకు వారికి పరిహారం అందలేదన్నారు. అలాగే రైతులకు రుణమాఫీ సకాలంలో కాకపోవడంతో బ్యాంకు వడ్డీల భారం పెరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల సుధాకర్, మండల నాయకులు సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement