పట్టాలపై తల పెట్టి రైల్వేఉద్యోగి..దారుణం | railway employee suicide on railway track | Sakshi
Sakshi News home page

పట్టాలపై తల పెట్టి రైల్వేఉద్యోగి..దారుణం

Jul 24 2016 8:02 PM | Updated on Nov 6 2018 8:12 PM

పట్టాలపై తల పెట్టి  రైల్వేఉద్యోగి..దారుణం - Sakshi

పట్టాలపై తల పెట్టి రైల్వేఉద్యోగి..దారుణం

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రైల్వే ఉద్యోగి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.

అడ్డగుట్ట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రైల్వే ఉద్యోగి రైలు పట్టాలపై  ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం...లాలాగూడ వర్క్‌షాప్‌లో కళాసిగా పని చేస్తున్న రామోళ్ల రాజేశ్వర్‌రావు కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఉద్యోగానికి కూడా సరిగ్గా వెళ్లలేకపోతున్నాడు. ఈ క్రమంలో జీవితం పై విరక్తి చెందిన రాజేశ్వర్‌ ఆదివారం ఉదయం లాలాగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రైన్‌ వస్తుండగా పట్టాలపై తలపెట్టి పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement