శ్రీశైలం ఆలయ పరిధిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు పెద్ద మొత్తంలో గుట్కా,ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీశైలం ఆలయ పరిధిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు పెద్ద మొత్తంలో గుట్కా,ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. సున్నిపెంట వైపు నుంచి వచ్చిన వాహనాలను సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ ముఖద్వారం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.40వేల విలువైన గుట్కా, ఖైనీలను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.