నాదెండ్లలో ఉన్మాది వీరంగం | psycho hulchul in nadendla | Sakshi
Sakshi News home page

నాదెండ్లలో ఉన్మాది వీరంగం

Aug 12 2016 12:28 PM | Updated on Sep 4 2017 9:00 AM

గుంటూరు జిల్లా నాదెండ్లలో శుక్రవారం ఉన్మాది వీరంగం సృష్టించాడు.

గుంటూరు : గుంటూరు జిల్లా నాదెండ్లలో శుక్రవారం ఉన్మాది వీరంగం సృష్టించాడు. స్థానికంగా నివసిస్తున్న ఇద్దరు మహిళలపై కత్తితో దాడి చేశాడు. దీంతో మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... ఉన్మాదిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement