భాతతీయ దేశీయ ఉత్పత్తులైన జనపనార, చేనేతలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం ఎంతైన అవసరం అని రాష్ట్ర మానవవనరుల, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
దేశీయ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం
Aug 9 2016 6:02 PM | Updated on Sep 4 2017 8:34 AM
మద్దిలపాలెం: భాతతీయ దేశీయ ఉత్పత్తులైన జనపనార, చేనేతలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం ఎంతైన అవసరం అని రాష్ట్ర మానవవనరుల, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కేంద్రం జౌళి సంస్థ ఆధ్వర్యంలో 70 వసంతాల భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కార్యక్రమం ఏర్పాటయ్యింది. మద్దిలపాలెం సి.ఎం.ఆర్ సెంట్రల్‌లో ఏర్పాటయిన కార్యక్రమానికి ముఖ్య అతి««థిగా మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కాన్వాస్‌పై త్రివర్ణ రంగులద్దారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ పరిశ్రమలైన జనపనార, చేనేత పరిశ్రమల ఉత్పత్తులపై ప్రజల్లో విస్తత ప్రచారం చేసే దిశగా కేంద్ర జౌళి పరిశ్రమలశాఖ మంత్రి స్మృతిఇరానీ ఆదేశాల మేరకు ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం అభినందనీయమన్నారు. దీరిలొ భాగంగా మంగళవారం నుంచి ఆగష్టు 15వ తేదీ వరకు వారం రోజుల పాటు సాగే కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కార్యక్రమంలో విశాఖ మహానగరంలో ఉన్న యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిస్తున్నట్టు తెలిపారు. ఆగష్టు 15న అన్ని కలర్స్ ఇండిపెండెన్స్ నమూనాలలో ఉత్తమమైనవి ఎంపిక చేసి ప్రత్యేక కార్యక్రమం రూపొందించనున్నట్టు తెలిపారు. జౌళి ఉత్పత్తులపై ఆధారపడే వేలాది మంది కార్మికులకు చేయూతనిచ్చే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కార్యక్రమంలో మదిని దోచే మనసులోని భావాలను వ్యక్తీకరించే అందమైన రూపాలనుందిచే రంగులు వేయడానికి సి.ఎం.ఆర్ ప్రాంగణంలో పెద్ద కాన్వాస్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జ్యూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ మూర్తి, సి.ఎం.ఆర్ అధినేత మావూరి వెంకటరమణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement