హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు | Prohibitory orders in the vicinity of the High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు

Aug 16 2016 10:26 PM | Updated on Aug 31 2018 8:31 PM

హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు - Sakshi

హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు

హైకోర్టు పరిసర ప్రాంతాల్లో విధించిన నిషేధాజ్ఞలను పొడిగించారు.

యాకుత్‌పురా: హైకోర్టు పరిసర ప్రాంతాల్లో విధించిన నిషేధాజ్ఞలను పొడిగించారు. ఈనెల 17 ఉదయం 6 నుంచి అక్టోబర్‌ 15వ తేదీ ఉదయం 6 గంటలకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని మంగళవారం నగర పోలీసు కమిషనర్‌ ఎం. మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు.

హైకోర్టు నుంచి సిటీ కళాశాల జంక్షన్, నయాపూల్‌ రోడ్డు, మదీనా సర్కిల్‌ నుంచి సిటీ కాలేజీ రోడ్డు, ఘాన్సీబజార్‌ నుంచి పటేల్‌ మార్కెట్, రికాబ్‌గంజ్, నయాపూల్‌ మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, ముస్లింజంగ్‌పూల్, మూసాబౌలి, మెహందీ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నంత కాలం హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలు, నిరసన, బహిరంగ సభలు, బైఠాయింపులు చేయకూడదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement