బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు.
- మెల్‌బోర్న్‌లో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్
రాయికల్ (కరీంనగర్ జిల్లా) : బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణవాదులు, ఎన్‌ఆర్‌ఐలు సైతం ఉద్యమానికి మద్దతిచ్చారన్నారు.
బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి అనిల్, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.