చెరువు నీటితో ఇక్కట్లు..!
కనగల్ : అన్ని గ్రామాల ప్రజలు చెరువులు నిండక అసంతృప్తితో ఉంటే కురంపల్లి ప్రజలు మాత్రం చెరువు నిండి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి ఆనుకుని ఎగువ భాగంలో చెరువు ఉంది. ఇటీవల మిషన్ కాకతీయ పనుల్లో చెరువును అభివృద్ధి చేశారు.
కనగల్ : అన్ని గ్రామాల ప్రజలు చెరువులు నిండక అసంతృప్తితో ఉంటే కురంపల్లి ప్రజలు మాత్రం చెరువు నిండి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి ఆనుకుని ఎగువ భాగంలో చెరువు ఉంది. ఇటీవల మిషన్ కాకతీయ పనుల్లో చెరువును అభివృద్ధి చేశారు. చెరులోకి భారీగా వరద నీరు చేరడంతో చెరువు అలుగుపోస్తుంది. ఈ క్రమంలో చెరువు అలుగు నీరంతా గ్రామం మధ్యలోంచి పారుతున్నందున ఇళ్లలోకి రావడంతోపాటు రోడ్లుపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనగల్ –చండూరు ప్రధాన రహదరికి అడ్డంగా నీరంతా పారతుండటంతో రోడ్డు కొతకు గురికావడంతోపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. చెరువు నిర్మాణం సమయంలో అలుగు నీరు పారే ప్రాంతంలో ఇళ్లు లేనప్పటికీ క్రమంగా గ్రామ జనాభా పెరుగుతూ నీరు పారే ప్రదేశంలో సైతం ఇళ్లును నిర్మించుకున్నారు. తమ పరిస్థితి కక్కాలేక మింగాలేక అన్న చందంగా దాపురించిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెవులు అలుగునీరు పోయేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.