మండల కేంద్రంలోని ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. స్థానిక సింధూజ డిగ్రీ కాలేజీ, భార్గవి ఒకేషనల్ కాలేజీ, తరిగొప్పులలోని వల్లభి జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు.
ప్రైవేట్ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
Aug 6 2016 11:52 PM | Updated on Sep 2 2018 3:39 PM
వరంగల్ : నర్మెట మండల కేంద్రంలోని ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. స్థానిక సింధూజ డిగ్రీ కాలేజీ, భార్గవి ఒకేషనల్ కాలేజీ, తరిగొప్పులలోని వల్లభి జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు.
యూనివర్సిటీ నిబంధనల ప్రకారం మౌలిక వసతులు, కళాశాల ఆట స్థలం, విద్యార్థులకు అనుగుణంగా క్లాస్‌రూంలు, అధ్యాపకుల లభ్యత, ఫీజుæ రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలపై ప్రభుత్వానికి రహస్య నివేదిక అందించనున్నట్లు తెలిపారు. సింధూజ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు పార్ట్‌టైంగా పని చేస్తున్నారని తెలిపారు. భార్గవి కళాశాలలో ల్యాబ్, గ్రంథాలయ సమస్య ఉందని, వల్లభి జూనియర్ కళాశాలలో అసంపూర్తి భవనం ఉందన్నారు. 700 కాలేజీలకుగానూ ఇప్పటిదాకా 450 చోట్ల సోదాలు పూర్తయ్యాయయన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈ సుగుణాకర్‌రావు, అధ్యాపకులు అంజయ్య, భాను కుమార్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement