ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అత్యవసర విభాగానికి నూతన భవనం నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ నిర్వాహకులకు సూపరింటెండెంట్ జగన్నాథ్ గురువారం కృతజ్ఙతలు తెలిపారు.
ఆస్పత్రి నిర్మాణానికి ప్లాన్ సిద్ధం చేయండి
Jul 28 2016 11:21 PM | Updated on Sep 2 2018 3:26 PM
అనంతపురం సిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అత్యవసర విభాగానికి నూతన భవనం నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ నిర్వాహకులకు సూపరింటెండెంట్ జగన్నాథ్ గురువారం కృతజ్ఙతలు తెలిపారు. మూడు రోజులుగా సెలవులో ఉన్న ఆయన గురువారం విధుల్లో చేరారు. కలెక్టర్ కోన శశిధర్ సూచనల మేరకు ఇంజనీరింగ్ కంపెనీ వారికి భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ సిద్ధం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారి నర్సయ్యకు సూచించారు. ప్లాన్‌ను జిల్లా కలెక్టర్‌కు చూపించి ఇంజనీరింగ్ కంపెనీ వారికి ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఈ మేరకు ప్లాన్‌ను నాలుగు రోజుల వ్యవధిలో అందజేస్తామని అధికారి నర్సయ్య తెలిపారు.
Advertisement
Advertisement