నీరు-చెట్టులోనైనా మెర‌క‌ చేయలేదు! | poor people rally for house sights | Sakshi
Sakshi News home page

నీరు-చెట్టులోనైనా మెర‌క‌ చేయలేదు!

Feb 23 2017 11:35 PM | Updated on Sep 5 2017 4:26 AM

నీరు-చెట్టులోనైనా మెర‌క‌ చేయలేదు!

నీరు-చెట్టులోనైనా మెర‌క‌ చేయలేదు!

బిక్కవోలు (అనపర్తి) : నీరు-చెట్టు కార్యక్రమంలోనైనా పేదల స్థలాలు మెరక చేస్తారని ఆశించిన లబ్ధిదారులకు నిరాశే మిగిలిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. నిరుపేదలకు గృహాల కల్పనలో టీడీపీ

డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి
బిక్కవోలు (అనపర్తి) :  నీరు-చెట్టు కార్యక్రమంలోనైనా పేదల స్థలాలు మెరక చేస్తారని ఆశించిన లబ్ధిదారులకు నిరాశే మిగిలిందని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. నిరుపేదలకు గృహాల కల్పనలో టీడీపీ అవలంబిస్తున్న జాప్యాన్ని నిరసిస్తు పార్టీ ఆధ్వర్యంలో బిక్కవోలులో గురువారం జరిగిన ర్యాలీకి విశేష స్పందన లభించింది. మామిడాడ రోడ్డులోని కాలనీ స్థలాల వద్ద జరిగిన సమావేశంలో లబ్ధిదారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. టీడీపీ అలసత్వం కారణంగా మౌలిక వసతుల కల్పనకు మంజూరు చేసిన నిధులు కూడా మురిగి పోయాయని డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా మౌనం వీడి నీరు-చెట్టులో జరిగిన వాస్తవాలు ప్రజల ముందుంచాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ఆర్‌ఐ చల్లా సంధ్యారాణి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు యమసాని రవీంద్రపాపారెడ్డి, వంటమి సూర్యప్రకాష్, కోరుకొండ నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి యరకారెడ్డి సత్య, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి నల్లమిల్లి దుర్గావరప్రసాదరెడ్డి, బిక్కవోలు, అనపర్తి మండల పార్టీ కన్వీనర్‌లు వంగా రామగోపాలరెడ్డి, మల్లిడి ఆదినారాయణరెడ్డి తదితరలు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement