సాగర్‌జలాలతో చెరువులు నింపాలి | ponds fill the sagar water | Sakshi
Sakshi News home page

సాగర్‌జలాలతో చెరువులు నింపాలి

Aug 23 2016 12:03 AM | Updated on Sep 4 2017 10:24 AM

సాగర్‌జలాలతో చెరువులు నింపాలి

సాగర్‌జలాలతో చెరువులు నింపాలి

యాద్గార్‌పల్లి (మిర్యాలగూడ రూరల్‌) : నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంతంలో ఉన్న చెరువులను నింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశాడు.

యాద్గార్‌పల్లి (మిర్యాలగూడ రూరల్‌) : నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంతంలో ఉన్న చెరువులను నింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశాడు. సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ, టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం మండలంంలో యాద్గార్‌పల్లిలో గల పందిళ్లపల్లి చెరువు (పెద్దచెరువు)లో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గత కొన్ని దశాబ్దాలుగా ఎండని యాద్గార్‌పల్లి చెరువుతోపాటు ఆయకట్టులోని చెరువులన్నీ ఎండిపోడంతో బోర్లు, బావుల్లో భూగ ర్భజలాలు తగ్గాయన్నారను. ఈ నేపథ్యంలో నీటిని విడుదల చేస్తే సాగు, తాగు నీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్‌ కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, సీపీఐ ,సీపీఎం మండల కార్యదర్శులు బంటు వెంకటేశ్వర్లు, పగిడోజు రామ్మూర్తి, రైతుసంఘం డివిజన్‌ కార్యదర్శి గార్ల ఇంద్రారెడ్డి, రాయకులు గోవింద రెడ్డి, శ్రీనివాసాచారి, పరశురాములు, గౌతంరెడ్డి, రామకృష్ణ, సీతారాములు, భరత్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement