కానిస్టేబుల్‌ అరెస్ట్‌ | police arrested | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ అరెస్ట్‌

Sep 6 2016 9:10 PM | Updated on Aug 21 2018 5:54 PM

మహిళా హోంగార్డుతో వివాహేతర సంబంధం సాగిస్తున్న కానిస్టేబుల్‌ను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి స్థానిక పోలీసు క్వార్టర్స్‌లో అరెస్టు చేశారు. ఏఎస్సై నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో రంపచోడవరం పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన ప్రదీప్‌ ఇటీవల ప్రత్తిపాడుకు బదిలీ అయ్యాడు. కాగా ప్రదీప్, మహిళా హోంగార్డు ఆదివారం అర్ధరాత్రి పోలీసు క్వార్టర్స్‌లో కలిశారు.

రంపచోడవరం :
మహిళా హోంగార్డుతో వివాహేతర సంబంధం సాగిస్తున్న కానిస్టేబుల్‌ను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి స్థానిక పోలీసు క్వార్టర్స్‌లో అరెస్టు చేశారు. ఏఎస్సై నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో రంపచోడవరం పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన ప్రదీప్‌ ఇటీవల ప్రత్తిపాడుకు బదిలీ అయ్యాడు. కాగా ప్రదీప్, మహిళా హోంగార్డు ఆదివారం అర్ధరాత్రి పోలీసు క్వార్టర్స్‌లో కలిశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త కారం రాజన్నదొర తన బంధువులతో వెళ్లి, ఆ క్వార్టర్‌ను చుట్టుముట్టి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి, వారిని అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచామని, కోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఎస్సై తెలిపారు. ఇలాఉండగా తన భార్య, ఆ కానిస్టేబుల్‌ కలిసి గతంలో తనపై తప్పుడు కేసు నమోదు చేయించారని రాజన్నదొర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement