
అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తున్న అధికారులు
జిల్లాలోని 17 విద్యుత్ సబ్‌స్టేషన్లలో కాంట్రాక్టు పద్ధతిని పనిచేసేందుకు ఆపరేటర్ల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న ఖమ్మం డివిజన్ అభ్యర్థులకు సోమవారం పోల్ క్లైంబింగ్ పరీక్షలు నిర్వహించారు. ఎన్‌పీడీసీఎల్ ఖమ్మం ఎస్‌ఈ ధన్‌సింగ్ ఈ పరీక్షలను ప్రారంభించారు.
ఖమ్మం: జిల్లాలోని 17 విద్యుత్ సబ్‌స్టేషన్లలో కాంట్రాక్టు పద్ధతిని పనిచేసేందుకు ఆపరేటర్ల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న ఖమ్మం డివిజన్ అభ్యర్థులకు సోమవారం పోల్ క్లైంబింగ్ పరీక్షలు నిర్వహించారు. ఎన్‌పీడీసీఎల్ ఖమ్మం ఎస్‌ఈ ధన్‌సింగ్ ఈ పరీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేటర్ల ఎంపిక పారదర్శకంగా జరగాలనే ఆలోచనతో గతంలో విడుదల చేసిన జాబితాను పునఃపరిశీలించి ఒక్క ఉద్యోగానికి ఐదుగురు చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసి పోల్ క్లైంబింగ్ పరీక్షలకు పిలిచామన్నారు. అభ్యర్థులు పోల్ ఎక్కిన విధానాన్ని ప్రమాణికంగా తీసుకొని మార్కులు వేస్తామని, ఎంత సమయంలో పోల్ ఎక్కారు... అనేది కీలకంగా భావించి ప్రతీ అభ్యర్థిని వీడియో చిత్రీకరణ చేస్తున్నామని చెప్పారు. చివరి దశ సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టామని ఎక్కడ ఏ అనుమానం వచ్చినా.. సదరు అభ్యర్థిని జాబితా నుంచి తొలిగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు రవి, నాగప్రసాద్, ఏఓ డేవిడ్, ఏడీలు బాలాజీ, నందరాథోడ్ తదితరులు పాల్గొన్నారు.